ముంబై ఇండియన్స్ జర్నీని ఈ ఐపీఎల్ లో చూస్తున్న మిగిలిన టీమ్స్ ఫ్యాన్స్ అయితే ఇదిగో ఇలా ప్రకాష్ రాజ్ ఎక్స్ ప్రెషన్స్ పెడుతున్నారు. అలా కాదు రా పిచ్చోడా...6 మ్యాచ్ లు ఎలా గెలిచేశారు రా వరుసగా అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు. రీజన్ తను ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్కటంటే ఒక్కటి గెలిచింది ముంబై. అంతెందుకు పదిహేను రోజుల క్రితం వరకూ అంటే ఏప్రిల్ 13వరకూ పాయింట్స్ టేబుల్ లో 7,8ప్లేసుల్లో ఉండేది ముంబై. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయి ఓ చెన్నై, ఓ ముంబై, ఓ హైదరాబాద్ అన్నట్లుండేది కదా. అలాంటిది చూస్తుండగానే ఎదిగిపోయింది. మాములు ఎదగటం కూడా కాదు నిన్న రాజస్థాన్ రాయల్స్ మీద ఏకంగా వంద పరుగుల తేడాతో విజయం సాధించి మొట్టమొదటి స్థానానికి చేరుకుంది పాయింట్స్ టేబుల్ లో. ముంబైకి నిన్న వచ్చిన భారీ విజయం తో నెట్ రన్ రేట్ బీభత్సంగా మెరుగుపడి ఎవరికీ అందనంత పొజిషన్ లో ఉంది ముంబై. ఆ టీమ్ కి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఇక నల్లేరు మీద నడకే. ఇంత సునాయాసంగా వరుసగా ఆరు విజయాలు అందుకుని గతేడాది ఆర్సీబీ నెలకొల్పిన ఆరు వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఓటముల్లో ఉన్నప్పుడు ముంబైలో ఫామ్ లో లేని ఆటగాళ్లంతా ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ లు అయితే హాఫ్ సెంచరీ ల మీద హాఫ్ సెంచరీలు బాదుతున్నారు. సూర్య కుమార్ యాదవ్ అయితే ఆరెంజ్ క్యాప్ కొహ్లీ పెట్టుకున్నా..సాయి సుదర్శన్ పెట్టుకుంటున్నా ఊరుకోవట్లేదు. లాగేసుకుంటున్నాడు. బౌల్ట్, బుమ్రా, ఆఖరకు కర్ణ్ శర్మ వరకూ ముంబై అందరూ అలా కలిసిసొచ్చేస్తుండటంతో ఈ సారి అంబానీ జట్టు ఆరో కప్పు దింపినా ఆశ్చర్యం లేదు అంటున్నారు అంతా.